బాలీవుడ్ కిలాడీకి భారీ రెమ్యునరేషన్

by Anukaran |   ( Updated:2020-07-24 00:50:37.0  )
బాలీవుడ్ కిలాడీకి భారీ రెమ్యునరేషన్
X

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భారీ సంపాదన కలిగిన ఇండియన్ హీరోల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అక్షయ్.. ఒక్క రోజు షూటింగ్‌కు కోటి రూపాయలు తీసుకుంటారని బాలీవుడ్ టాక్. అంటే ప్రతీ సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటాడన్న మాట. ప్రస్తుతం అక్షయ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ధనుష్, సారా అలీఖాన్ జంటగా తెరకెక్కుతున్న ‘అట్రంగి రే’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం అక్షయ్ కేవలం రెండు వారాలకు రూ. 27 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 2 కోట్లు.

సాధారణంగా ఒక రోజు షూటింగ్‌కు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే అక్షయ్.. ఈ చిత్రానికి మాత్రం రెండు కోట్లు తీసుకోవడానికి కారణం లేకపోలేదు. సినిమాలో కీలమైన ఈ పాత్ర కోసం ఎలాగైనా సూపర్‌స్టార్‌ను ఎంచుకోవాలని అనుకున్నారట దర్శకుడు కె. ఎల్.రాయ్. అందుకే ముందుగా బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్టు సమాచారం. కానీ తను ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల.. అక్షయ్‌ను ఓకే ఈ సినిమాలో నటించాలని కోరినట్టు తెలుస్తోంది. తను కూడా బిజీగా ఉన్నానని చెప్పడంతో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ డైరెక్టర్ ఓకే చేయించారని టాక్.

Advertisement

Next Story