- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పే స్కేల్ ఇవ్వండి
దిశ, తెలంగాణ బ్యూరో: మూడు నెలల్లో తమకు అర్హతను బట్టి పే స్కేలు నిర్ణయిస్తామని గతేడాది సెప్టెంబరులో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటికైనా పే స్కేలు అమలు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్ కోరింది. 2017 లో టీఎస్‌పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వీఆర్ఏలకు సర్వీసులను క్రమబద్ధీకరించి, ఉద్యోగ రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు గుర్తు చేశారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు 8 సంవత్సరాల అనుభవంతో రెవెన్యూ శాఖ పరిపాలనపై పట్టు సాధించినట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటేశ్ యాదవ్‌లు తెలిపారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు కావడంతో వీఆర్ఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాం.. కేవలం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపైనే జీవితాలు, భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. వీఆర్వోలతో సమాన వేతనం ఉన్న జూనియర్ అసిస్టెంట్లుగా, డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలను గుర్తించాలని కోరారు.