- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెలికాప్టర్ క్రాష్‌పై అనుమానం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ క్రాష్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ స్పందించారు. ఎమ్ఐ17 ఎలా కూలిపోయిందో అర్థం కావడం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్ఐ-17-వీ5 హెలికాప్టర్లు ప్రధానంగా వీఐపీలను తీసుకెళ్లేందుకు వాడతామని, అటువంటిది కూలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ‘ఎమ్ఐ-17-వీ5 హెలికాప్టర్లను ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఎగరవేశాం. సియాచిన్ మంచు తుఫానులో సైతం ఆ హెలికాప్టర్లు అద్భుతంగా పని చేశాయి. అదే విధంగా మరెన్నో పరిస్థితుల్లోనూ అవి ఇబ్బంది పెట్టలేదు. అందుకనే వాటిని ట్రాన్స్ పోర్ట్ కోసం వాడటం ప్రారంభించాం.
రాష్ట్రపతి, ప్రధాని వంటి వీఐపీలను తీసుకెళ్లేందుకు కూడా వీటిని వాడుతాం. అందులోనూ బుధవారం కూలిన హెలికాప్టర్ అత్యాధునికమైనది. దీనిని రష్యా వారు తయారు చేశారు. ఈ హెలికాప్టర్లను భారత్ 2008-2018 మధ్యలో అధికంగా కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. ‘సులూర్ నుంచి విల్లింగ్‌టన్‌కు కేవలం 20-25 నిమిషాల ప్రయాణం. ఆ కాస్త సమయానికే హెలికాప్టర్ కూలిపోవమేంటి. అందులోనూ హెలికాప్టర్ భూమి నుంచి కేవలం 5వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఆ కాస్త ఎత్తు నుంచి ల్యాండ్ చేయడం పెద్ద కష్టం కాదు. మరి అంతటి ప్రమాదం ఏలా జరిగిందో తెలుసుకోవడం కష్టంగానే ఉంద’ని మాజీ ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఫాలీ హెచ్ మేజర్ తెలిపారు.
అదే విధంగా హెలికాప్టర్ వాయిస్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుందని, దానిని పరిశీలిస్తే ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే భారత వాయు దళం హెలికాప్టర్ క్రాష్‌పై విచారణ చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది.