- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raj kundra : రాజ్ కుంద్రా పోర్న్ వీడియో కేసు.. పోలీసులు లంచం తీసుకున్నారా..?
దిశ, వెబ్‌డెస్క్: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన వ్యాపార వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి రోజుకో వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా తనను పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి ముందుగానే రూ. 25 లక్షల లంచం చెల్లించారనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు ముంబై మిర్రర్ సహా పలు స్థానిక పత్రికలు ప్రచురించడం సంచలనంగా మారుతున్నది.
అశ్లీల వీడియోల కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్న అరవింద్ శ్రీవాత్సవ గత మార్చి ముంబైలోని ఏసీబీ అధికారులకు పంపించిన ఈ మెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించాడని ‘మిడ్ డే’ వార్తా సంస్థ ప్రచురించింది. మార్చిలో ఏసీబీకి అతడు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించగా ఆ ఈమెయిల్ ను ముంబై పోలీస్ కమిషనర్ కు ఏసీబీ ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయమై ముంబై పోలీసులు వివరణ ఇవ్వడానికి నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గత ఫిబ్రవరిలో అరవింద్ శ్రీవాత్సవ పై కేసు నమోదు అవ్వగా.. అతనిని ఏసీబీ విచారించింది. ఇకపోతే ఇదే కేసులో రాజ్ కుంద్రా కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ముందుగానే అరెస్ట్ కాకుండా ఉండడానికి ఆయన లంచం ఇచ్చారా..? పోలీసులు ఈ విషయాన్ని దాచి పెట్టారా..? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈ లంచం వ్యవహారాన్ని పోలీస్ కమిషనర్ కు చేరవేయడంతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారా..? అని ముంబై వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయమై పోలీసులు ఏమని వివరణ ఇస్తారో చూడాలి.