దీనిని సీఎం కేసీఆరే స్వయంగా పరిశీలిస్తున్నారు: కలెక్టర్ ఉదయ్

by Sridhar Babu |
Dharani-Portal-12
X

దిశ, కల్వకుర్తి: ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన క్లెయిమ్స్ అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎమ్మార్వోలను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెల్దండ, ఉరుకొండ ఎమ్మార్వో కార్యాలయాలను ఆయన సందర్శించారు. ధరణికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మార్వోలు పూర్తిగా ధరణిపై దృష్టి పెట్టాలని, ధరణి కింద ఉన్న ప్రతి క్లెయిమ్ ను పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి అంశాన్ని రాష్ట్రస్థాయిలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారన్నారు. అందువల్ల వాటి పరిష్కారంపై ఎమ్మార్వోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనందున ఎమ్మార్వోలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలన్నింటికీ ఒక సమయాన్ని నిర్దేశించుకొని నిర్దేశించిన సమయం ప్రకారం వాటిని పూర్తిచేయాలన్నారు. ప్రొహిబిటెడ్ భూములకు సంబంధించిన అప్లికేషన్ లపై రికార్డులను పరిశీలించి అప్డేట్ చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో రాజేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed