- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్‌లో సైబర్ నేరాలు పెరిగాయి: డీజీపీ
దిశ, క్రైమ్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో మహిళలు, పిల్లలపై సైబర్ నేరాలు అధికమవుతున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మహిళలు, పిల్లలపై వేధింపుల నివారణకు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో చేపడుతున్న సైబ్ హర్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో అత్యధికంగా మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ఇదే సమయంలో మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాలు గణనీయంగా నమోదు అవుతున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా కలిగించే ముప్పును ఎలా తప్పించుకోవాలానే అంశాలపై ఆన్‌లైన్ ద్వారా చైతన్య పర్చేందుకు మహిళా సేఫ్టీ వింగ్ సైబ్-హర్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమ బ్రోచర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు, హీరో నాని, యాంకర్ సుమ పాల్గొన్నారు.