బోనాల స్పెషల్ : బల్కంపేట ఎల్లమ్మ గురించి ఒళ్ళు గగుర్లు పొడిచే ముచ్చట్లు ఇవే!

by Jakkula Samataha |
బోనాల స్పెషల్ : బల్కంపేట ఎల్లమ్మ గురించి ఒళ్ళు గగుర్లు పొడిచే ముచ్చట్లు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : హైదరాబాద్‌లో బోనాల పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆషాఢమాసంలో నగరంలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. పోతరాజుల ఆటలు, మహిళలు బోనాలు, శివసత్తుల ఆటలతో నగరం మొత్తం సందడి నెలకొంటుంది. ఇక ఆషాఢ మాసంలో స్పెషల్‌గా బల్కం పేట ఎల్లమ్మకు బోనాలు చేసి, కళ్యాణం జరిపిస్తారు. అయితే ఈ అమ్మవారిని వరాలిచ్చే తల్లి అని కూడా అంటారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. కాగా, ఆ అమ్మవారి గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బల్కంపేట ఎల్లమ్మకు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ తల్లికి బోనం , ఓడి బియ్యం పోసి సారే పెడతారు. ఇక ఈ అమ్మవారిని కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తూ, వారి కోరికలను తీరుస్తుదంట. అయితే ఈ దేవత హైదరాబాద్ ఏర్పడక ముందే బల్కంపేట ప్రాంతంలో కొలువుదీరిందంట. ఓ రైతు తన పొలానికి నీరు సరిపోకపోవడంతో, బావి తవ్వించాలని నిర్ణయించుకున్నాడు.దీంతో ఆయన బావి తవ్వుతుండగా ఓ బండరాయి అడ్డుగా వచ్చింది. అది ఎంతకు పక్కకు జరగలేదు. దీంతో ఊరి ప్రజలు కూడా వచ్చి దానిని జరపడానికి ప్రయత్నం చేసినా ఆ రాయి కదలలేదంట. ఇక అప్పుడు గ్రామస్తులు ఇది ఏమిటని ఆలోచించి, ఆరా తీయగా, రేణుక ఎల్లమ్మ తల్లి అని భావించి, విగ్రహం బావిలో ఉండగానే పూజలు చేశారంట. తర్వాత అక్కడే ఆలయం కూడా నిర్మించారు.1919లో ఆ ప్రాంత సంస్థానాధీషుడిగా ఉన్న రాజా శివరాజ్ బహద్దూర్ ఆలయాన్ని నిర్మించారని సమాచారం. అప్పటి నుంచి ప్రజలందరూ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కొలుచుకుంటారు. తల్లిని భక్తితో కొలుచుకున్నా, అమ్మవారి తల వెనుక భాగం నుంచి ప్రవహించే జలధాన నీటిని తీసుకొని ఇంటిని శుధ్ది చేసుకున్నా, స్నానం చేసినా ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story

Most Viewed