Ravanasura: రావణాసురుడు నెరవేరని కలలు ఇవే.. అది నిజమై ఉంటే రక్తం రంగు తెల్లగా ఉండేదా?

by Prasanna |
Ravanasura: రావణాసురుడు నెరవేరని కలలు ఇవే.. అది నిజమై ఉంటే రక్తం రంగు తెల్లగా ఉండేదా?
X

దిశ, వెబ్ డెస్క్ : మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా రామాయణం(Ramayan) చాలా పాపులర్. నేపాల్, శ్రీలంకలో అయితే రామాయణం గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు. రాముడు వనవాసానికి వెళ్లడం, అక్కడే రావణాసురుడు(Ravan) సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సహయంతో రాముడి వద్దకు సీతాదేవిని తిరిగి తెచ్చుకోవడం మనకీ తెలిసిన విషయాలే. పది తలలను కలిగిన ఉండే రావణుడు గొప్ప పండితుడు, గొప్ప యోధుడు. అయితే, ఇతను తన జీవితంలో కన్న ప్రతి కల నెరవేరాలని ఆశ పడ్డాడు. కానీ, కొన్ని నెరవేరలేదు. అవి నిజమై ఉంటే ఈ రోజు వరల్డ్ కలర్ ఫుల్ గా ఉండేది. అవేంటో ఇక్కడ చూద్దాం.

సముద్రపు నీటిని తియ్యగా మార్చడం

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అయితే,రావణుడు సముద్రపు నీరు తియ్యగా మారాలని చాలా కోరుకున్నాడట. ఇది రావణుడి మొదటి కలగా పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ కోరిక నెరవేరలేదు. ఇది నెరవేరి ఉంటే ఇంకోలా ఉండేది.

బంగారంలో సువాసన

లంక.. మొత్తం బంగారంతో తయారు చేయబడింది. దీని ప్రకాశం ఎలా ఉంటుందంటే.. ఒకసారి చూస్తే తన వైపుకు ఆకర్షించిలే ఉంటుంది. అలాంటి బంగారానికి సువాసనను సృష్టించాలనుకున్నాడు. కానీ, ఇది కూడా కల గానే మిగిలిపోయింది.

రక్తం రంగును మార్చడం

రక్తం రంగు ఎరుపులో ఉంటుంది. అయితే, ఈ రంగు ఉంటే ప్రజలు భయపడతారని.. రక్తం రంగును తెల్లగా మారాలని కోరుకున్నాడు. కానీ, ఈ కోరిక నెరవేరలేదు.

తండ్రి ముందు కొడుకు చనిపోకూడదు

ఏ కొడుకు తండ్రికి ముందు చనిపోకూడదని రావణుడు కల కన్నాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడం భరించే వాళ్ళకి పెద్ద బాధ. కానీ, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో ఎవరైనా చనిపోవడం ఖాయం. ఇది కూడా కల గానే మిగిలిపోయింది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed