అంతుచిక్కని మిస్టరి ప్రతిఏడాది ఎత్తు పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా..

by Sumithra |
అంతుచిక్కని మిస్టరి ప్రతిఏడాది ఎత్తు పెరుగుతున్న శివలింగం.. ఎక్కడో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందినవి. దేశంలో ఉన్న ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని దేవాలయాల్లోని దేవుళ్లు స్వయంభూగా వెలిస్తే మరికొన్ని దేవాలయాలు రాజుల కాలంలో నిర్మించినటువంటివి. అలాంటి ఆలయాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆలయాల్లో ఈ శివాలయం కూడా ఒకటి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివాలయం ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడి శివలింగం ప్రతి ఏటా పెరుగుతుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆలయం బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లా అరా పట్టణంలో వెలసింది. దేశంలో వెలసిన అనేక పురాతన ఆలయాల్లో ఈ బుద్వా మహాదేవ్ ఆలయం కూడా ఒకటి. మహాభారతంతో ఈ ఆలయానికి సంబంధం ఉందని అక్కడి పండితులు చెబుతున్నారు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఇక్కడ వెలసిన ఈ మహాదేవున్ని పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే బుద్వా ఆలయంలో వెలసిన శివయ్యను భోజ రాజు పూజించేవాడని కూడా చెబుతున్నారు.

10 రోజుల తవ్వకాల తర్వాత దొరికిన శివలింగం..

మహాదేవ్ ఆలయ ప్రధాన పూజారి శశి శేఖర్ పాండే ఈ అజ్గైబినాథ్ మహాదేవ్ ఆలయం తన ముత్తాత భూమిలో ఉందని చెప్పారు. కొన్నాళ్ల క్రితం ఒక మహర్షి ఆ వృద్దుని దగ్గరకు వచ్చి, మీరు నివాసం ఉంటున్న ప్రదేశం భోలేనాథ్ ప్రదేశమని చెప్పారట. ఈ నేల కింద మహాదేవ్ ఉన్నాడని, విశ్వాసం లేకపోతే భూమిని తవ్వి చూడాలని సెలవిచ్చారట. సాధువు అన్న మాటలు ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించాయట. ఆ తర్వాత భూమిని తవ్వడానికి ఏర్పాట్లు చేశారు. సుమారు 10 రోజుల పాటు నిరంతరాయంగా తవ్విన తర్వాత భూమి లోపల నుండి శివలింగం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.

ప్రతి సంవత్సరం పెరుగుతున్న శివలింగం పరిమాణం..

ఈ భోలేనాథ్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం శ్రావన మాసంలో ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఒక అంగుళం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ శివలింగం భూమిలో నుంచి ఉద్భవించినప్పుడు చాలా చిన్నదని, పురాణాలు చెబుతున్నాయని పూజారి చెప్పారు. అనంతరం గ్రామస్తులు శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. శివలింగానికి పూజలు ప్రారంభమైనప్పటి నుంచి, మహాదేవునికి భక్తులు అభిషేకం చేస్తున్నా కొద్దీ ప్రతి సంవత్సరం శివలింగం పరిమాణం పెరగడం ప్రారంభమైందని చెబుతున్నారు. ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లోని ఇతర జిల్లాల నుండి వేలాది మంది శివ భక్తులు ఇక్కడికి చేరుకుని శివలింగానికి జలాభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో భోలేనాథ్‌కు జలాభిషేకం చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతే కాదు ఈ శివలింగాన్ని అభిషేకించిన నీటిని తీసుకుంటే చర్మవ్యాధులను నయం అవుతాయని భక్తుల నమ్మకం.

Advertisement

Next Story

Most Viewed