- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shani Dev: శని అస్తమయం.. ఆ రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అన్నింటిలో శని గ్రహానికి ( Shani Dev ) ప్రత్యేక స్థానం ఉంటుంది. శని సహనాన్ని, ఓర్పును ఇచ్చే గ్రహం. మనం చేసే పనులను బట్టి కర్మ ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడు ఇలా ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. శని దేవుడు కన్నెర్ర చేస్తే ధనవంతుడు కూడా బిచ్చగాడిలా మారతాడు. ఎవరి జాతకంలో అయితే శని స్థితి మంచిగా ఉంటుందో వారికీ శుభాలు కలుగుతాయి. నీచ స్థితిలో ఉంటే ఏ పని చేసినా ఎదురే వస్తుంది. ఫిబ్రవరి 28 న శని అస్తమించాడు. దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. శనిగ్రహం కుంభరాశిలో అస్తమించడం వలన రాబోయే 40 రోజులు పాటు మూడు రాశుల వారికి బ్యాడ్ టైం నడవనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృశ్చిక రాశి
శని అస్తమయం వలన వృశ్చిక రాశి వారికి అశుభంగా ఉంటుంది. అలాగే, ఈ సమయంలో మొదలు పెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. స్నేహితులకు డబ్బు ఇచ్చి మోసం పోతారు. వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు. పెట్టుబడులు పెట్టిన వారు ఆర్ధికంగా ఇబ్బంది పడతారు.
కుంభ రాశి
శని అస్తమించడం వలన కుంభరాశి వారు కొన్ని రోజులు ఇబ్బందులు పడతారు. మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. ఉద్యోగాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి, ఆచితూచి నెమ్మదిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
సింహ రాశి
శని అస్తమించడం వలన సింహరాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. తొందరపాటు నిర్ణయాల వలన చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.