కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-01 13:45:59.0  )
కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలు జరుపుకునే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది రంజాన్(Ramadan 2025). నిన్న శుక్రవారం నెలవంక(చండ్రుడు) కనిపిస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. తాజాగా శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి(ఆదివారం) నుంచి దేశ వ్యాప్తంగా రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు రంజాన్ పండుగ(Ramadan Festival)కు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇప్పటికే రంజాన్ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప‌వాస దీక్ష‌ల నేప‌థ్యంలో రేప‌ట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వ‌ర‌కు ఉర్దూ విద్యార్థుల‌కు ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ మీడియం విద్యార్థుల‌కు ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు.



Next Story

Most Viewed