Rakhi celebrations: పశువులకు రాఖీ కట్టి.. సముద్రాన్ని పూజిస్తోన్న వైనం.. ఎక్కడో తెలుసా?

by Anjali |
Rakhi celebrations: పశువులకు రాఖీ కట్టి.. సముద్రాన్ని పూజిస్తోన్న వైనం.. ఎక్కడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: సోదర సోదరీమణులు ఎంతగానో ఎదురుచూస్తోన్న పండుగ రానే వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. ఈ రాఖీని సోదర సోదరీమణులు అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఒకరికొకరు అండగా ఉంటామని భరోసానిస్తూ రాఖీని సెలబ్రేట్ చేసుకుంటారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా, తోబుట్టిన వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు సోదరులంతా తమ స్తోమను బట్టి గిఫ్ట్స్ ఇస్తారు. కొంతమంది విలువైన కానుకలు సమర్పించి సిస్టర్స్‌ను సర్ప్రైజ్ చేస్తారు. అయితే నేడు దేశవ్యాప్తంగా రాఖీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కాచెల్లెళ్లంతా తమ పుట్టింటికి చేరుకుంటున్నారు.

అయితే రాఖీని కేవలం సోదరులకే కాదు.. ఓ రాష్ట్రంలో పశువులకు కూడా కడతారట. అక్కడ పశువులకు రాఖీ పండుగ రోజు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారట. ఎద్దులను ఎంతో అందంగా ముస్తాబు చేసి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి దేవుళ్ల వలే వాటిని పూజిస్తారట. రాఖీ పండుగను వ్యవసాయ సంబంధిత ఆచారాలకు ప్రసిద్ధిగా కొలుస్తారట. ఇదే రోజు శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారట. అనంతరం గంహ దియాన్ అనే వేడుక జరుపుకుంటారు. రాఖీ పండుగ సందర్భంగా ఇన్ని ఆచారాలను పాటించే రాష్ట్రం ఎంటని అనుకుంటున్నారా? అదే ఒడిశా రాష్ట్రం.

Advertisement

Next Story

Most Viewed