- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెల 18 న నిర్జల ఏకాదశి.. ఆ రోజున ఉపవాసం ఉంటే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది!
దిశ, ఫీచర్స్: నిర్జల ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏడాదిలో అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి వ్రతం రోజు ప్రారంభంలో చుక్క నీరు కూడా తాగకుండా, ఏమీ తినకుండా ఆచరిస్తారు. ఈ ఏకాదశి తిథి శ్రీహారి దేవుడికి అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణువు నుండి విశేష ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది, నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18, 2024 న జరుపుకోనున్నారు.
నిర్జల ఏకాదశి 2024 శుభ ముహూర్త సమయం
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రారంభం – జూన్ 17 ఉదయం 04.43 గంటలకు మొదలయి జూన్ 18 ఉదయం 07:28 గంటలకు ముగుస్తుంది.
నిర్జల ఏకాదశి నాడు నీరు లేకుండా ఉపవాసం ఉండడం ఆనవాయితీ. ఈ ఏడాదిలో అన్ని ఏకాదశులలో ఉపవాసం లేని వాళ్ళు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉంటే అన్ని ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితాలను పొందగలరని చెబుతున్నారు. నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వలన అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.