- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగా స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఇంట్లో దరిద్రం వస్తుంది..
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో గంగా దసరా రోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున గంగామాత భూమి పై వచ్చిందని నమ్ముతారు. గంగా దసరా రోజున గంగా స్నానం చేయడం గొప్ప విశిష్టత. గంగానదిని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు. హిందూ మతంలో పవిత్రమైన గంగా జలం లేకుండా ఏదైనా మతపరమైన పని అసంపూర్ణంగా పరిగణిస్తారు. గంగా దసరా రోజున గంగా స్నానం చేయడం వలన అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే లక్షలాది మంది ప్రజలు కలిసి ఈ రోజున విశ్వాసంతో మునిగిపోతారు. గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనిషి అన్నిరకాల పాపాలు నశిస్తాయి.
అందుకే మీరు గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చేయాలంటున్నారు నిపుణులు. అయితే మీరు ఈ పవిత్ర నదిలో స్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఆ పాపాలు చేస్తే అతను పాపంలో భాగస్వామి అవుతాడు. దాని కారణంగా అతను పేదరికం, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గంగాస్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.
గంగా నదిలో స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
మళ్లీ స్నానం చేయవద్దు - మీరు గంగా నదిలో ఒకసారి స్నానం చేసినట్లయితే వెంటనే ఇంటికి వెళ్లి మళ్లీ స్నానం చేయకూడదు. అలాచేస్తే అశుభం అని చెబుతున్నారు పండితులు. అలాగే ఇలా చేయడం వల్ల గంగామాతకి కోపం రావచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గంగా నదిలో స్నానం చేసేటప్పుడు, 7 సార్లు మాత్రమే మునగాలి. దీని కంటే ఎక్కువ లేదా తక్కువ ముంచడం వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది.
మలమూత్రాలను విసర్జించవద్దు - గంగాస్నానం చేసేటప్పుడు మలమూత్రాలను విసర్జించకూడదు. అంతే కాదు అపరిశుభ్రమైన బట్టలు ధరించి నదిలో స్నానం చేయవద్దు. అలా చేయడం వలన ఇంట్లో అశుభం కలగడమే కాదు, ఆ వ్యక్తి పాపాలలో భాగస్వామి అవుతాడు.
బట్టలు ఉతకకండి - గంగా నదిలో స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకడం తప్పు. దీని కారణంగా ఆ వ్యక్తికి పాపం చుట్టుకుంటుందని చెబుతారు. అలాగే అలా చేయడం వల్ల అకాల మరణానికి కూడా కారణం కావచ్చు.
సబ్బును ఉపయోగించవద్దు - గంగా నదిలో స్నానం చేసేటప్పుడు సబ్బును ఉపయోగించవద్దు. శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం అశుభం.