- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Yadagirigutta News : ఘనంగా యాదగిరిషుడుకి గరుడ వాహన సేవోత్సవం

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirugutta Sri LakshmiNarasimha Swamy) పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavalu) భాగంగా స్వామి వారిని శ్రీ మహావిష్ణువు అలంకార సేవలో గరుడ వాహనం(Garuda vahana)పై ఊరేగించారు. స్వామి ప్రియ వాహనమైన గరుడునిపై విహరించిన స్వామి వారు ప్రసన్నవదనంతో భక్తులకు దర్శనమిచ్చారు. వేంచేపు మండపంలో స్వామి అలంకార సేవ, మంగళనీరాజనం నిర్వహించారు. అనంతరం అర్చక పండితులు, యజ్ఞికులు, పారాయణికులు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య మేళా తాళాలతో శ్రీ మహావిష్ణువు అలంకార సేవలో స్వామి గరుడవాహనంపై ఊరేగారు. స్వామివారిని దర్శించుకుని భక్తుల పులకించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ భాస్కర్ రావు, ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం లక్ష్మీ నరసింహులకు దివ్య విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా దేవస్థానం అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల పర్వంలో వైష్ణవ పాంచరాత్రాగమశాస్త్రానుసారం నిర్వహించిన లక్ష్మీ నరసింహుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు.