- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచుకోవచ్చా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
దిశ, ఫీచర్స్: హిందూ మతంలో వాస్తుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు, ఇంటి ఆవరణలో వాస్తు దోషాన్ని తొలగించడానికి అనేక నివారణ చర్యలు ఉన్నాయి. ప్రతీ ఇంట్లో ఏదొక చెట్టు ఉంటుంది. కొంతమంది తమ నివాస స్థలాలలో వివిధ రకాల మొక్కలను పెంచడానికి ఇష్టపడతారు. అయితే, కొంత మంది తెలియక చేసే పనుల వల్ల నష్టాలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కల పెంపకానికి సరయిన దిశలను ఎంచుకోవాలి. చెట్లు, మొక్కలు నాటడం ద్వారా, ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు.
వాస్తు ప్రకారం, ఇంట్లో తప్పుడు స్థలంలో మొక్కలు, చెట్లను నాటడం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కరివేపాకు మొక్కను చాలా ఇళ్లలో విరివిగా పెంచడం చూస్తుంటాం. కొన్ని చోట్ల కరివేపాకు చెట్టు ఎండిపోయినట్టుగా ఉంటుంది. కానీ, ప్రతిదానికీ దాని స్థానం ఉన్నట్లే, ఇంట్లో కరివేపాకు మొక్కను నాటడానికి తగిన స్థలం ఉంటుంది. ఈ మొక్కను ఏ దిశలో నాటితే మంచిగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి పడమర దిక్కున కరివేపాకులను నాటడానికి అనువైన ప్రదేశం. ఈ పశ్చిమ దిశను చంద్రుని దిశగా చెబుతుంటారు. ఈ దిశలో మొక్కను నాటడం మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ దిక్కున కరివేపాకు మొక్కను నాటితే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు వాస్తు నిపుణులు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.