Sabarimala : శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు

by Y. Venkata Narasimha Reddy |
Sabarimala : శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమల(Sabarimala)ఆలయానికి అయ్యప్ప స్వామి భక్తులు(Ayyappa devotees) పోటెత్తారు. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులు బారులు తీరారు. అయ్యప్ప దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. భక్తుల అయ్యప్ప శరణు ఘోషలతో శబరి గిరులు మారుమ్రోగుతున్నాయి. రోజుకి 80 వేల మందికిపైగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) తెలిపింది. మండల మకర విళక్కు సీజన్‌లో భాగంగా నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా నిత్యం లక్ష మంది వరకు దర్శనానికి తరలివస్తున్నారు. మరికొంత మంది సంక్రాంతి మకర జ్యోతి సమయానికి దర్శనానికి వెళ్తుంటారు. మకర జ్యోతి దర్శనం తర్వాత ఆలయాన్ని ట్రావెన్ కోర్ సంస్థానం మూసి వేయనుంది. మండల దీక్ష భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వండిపెరియార్‌ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్‌లైన్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సీజన్‌లో భారీగా అయ్యప్ప దర్శనాలకు భక్తుల వస్తారని అంచనా వేసి.. రోజుకు 80 వేల మందికి (వర్చువల్ క్యూ 70,000, స్పాట్ బుకింగ్‌లు 10,000) దర్శన టిక్కెట్లు జారీచేయాలని అధికారులు నిర్ణయించారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు 90వేలకు పెంచేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చర్యలు చేపట్టింది. దీని వల్ల భక్తుల సంఖ్య మరింత పెరుగుతోందని తెలుస్తుంది. ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పలు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరకుట్ట సమీపంలోని మూడు చోట్ల భక్తులను నియంత్రించి... సన్నిధానానికి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా ఉండేందుకు ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Advertisement

Next Story