- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
దిశ, వెబ్‌డెస్క్: వనదేవతలు కొలువై ఉన్న మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. మినీ మేడారం జాతరలో భాగంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెలపై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
మేడారం జాతరకు వచ్చే భక్తులు సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ నుంచి బస్సుల సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ నెల 24న ప్రారంభమైన చిన్న జాతర 27వ తేదీ వరకు కొనసాగనుంది.