8 రోజుల నుంచి వాటర్లోనే దేవీపట్నం

by srinivas |
8 రోజుల నుంచి వాటర్లోనే దేవీపట్నం
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అతలాకుతలమైపోతోంది. ప్రస్తుతం జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. అటు పలు గ్రామాలకు పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. గత 8 రోజుల నుంచి దేవీపట్నం జలదిగ్భందంలోనే ఉంది. అటు 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో 20 గ్రామాలు నేటి వరకు వరద ముంపులోనే ఉన్నాయి. పోచమ్మగండి, తొయ్యేరు, దేవీపట్నంలో పూరిగుడిసెలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలకూలడంతో బాధితులు ఆందోళనచెందుతున్నారు.

Advertisement

Next Story