PM Modi: ఆరోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-11 14:38:03.0  )
PM Modi: ఆరోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir) గందర్‌బల్‌ జిల్లాలోని సోన్‌మార్గ్‌(Sonmarg) ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం భారీ టన్నెల్‌‌ను నిర్మించింది. ఈ టన్నెల్ (Z-Morh Tunnel) పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ టెన్నెల్‌ను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా శనివారం సోన్ మార్గ్ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా(X) వేదికగా పంచుకున్నారు.

‘ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోన్‌మార్గ్‌ టన్నెల్‌(Sonmarg Tunnel)ను సందర్శించాను. సందర్శకుల కోసం ఏడాది పాటు ఈ సోన్ మార్గ్ టన్నెల్ తెరిచే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని స్కీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శీతాకాలంలో ఇక్కడి ప్రజలంతా ఇకపై ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. శ్రీనగర్ నుండి కార్గిల్/లేహ్‌కి ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది’ అని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఓమర్ అబ్దుల్లా ట్వీట్‌కు ప్రధాని మోడీ స్పందించారు. ‘సొరంగ మార్గం ప్రారంభంతో పాటు కశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో పర్యటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.




Next Story

Most Viewed