- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ,తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బృహత్తర విద్యా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బృహత్తర విద్యా పథకం అమలుపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులతోపాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
రూ. 2 వేల కోట్లతో అమలు చేయునున్న బృహత్తర విద్యా పథకం అమలుకు తుది మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. ఇరత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులచే క్యాబినెట్ వివరాలు సేకరించింది. కేజీ టూ పీజీ విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగానే నాణ్యమైన విద్యను అందిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని కమిటీ వివరించింది.
ఉన్నత విద్యలో ప్రతిభ కనబర్చాలంటే ప్రాథమిక విద్యా రంగాన్ని పటిష్ట పరచడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అదనపు గదులను, నూతన భవనాలను, తాగునీరు, డిజిటల్ తరగతులు వంటి మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని కమిటీ పేర్కొంది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శి రఘునందన్ రావు, విద్యాశాఖ సంచాలకులు దేవసేన తదితర అధికారులు పాల్గొన్నారు.