అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి: శ్రీనివాస్ గౌడ్

by Shyam |
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి: శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గత 6 సంవత్సరాల కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా కలెక్టర్ వెంకట్ రావ్, ఎస్పీ రేమారాజేశ్వరిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed