- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో ఇవాళ ఏం జరుగతది.. పూర్తి డీటెయిల్స్
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మంధిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నేడు జరగనున్నది. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశమంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన విధంగా ఏర్పాట్లు చేసింది. ప్రతి చోటా భద్రతను కట్టు దిట్టం చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంది. అయితే, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ మందిరం మూడున్నరేళ్లలో పూర్తి కానున్నది. దీనిని నగర శైలిలో నిర్మించనున్నారు.
అయితే.. కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి…
ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభకానున్నది. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రముఖులు ముందుగానే అక్కడికి చేరుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకుంటారు. అంతకుముందే ఆయన హనుమాన్ గర్హి ఆలయాన్ని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భూమి పూజ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 2 వేల ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి తెచ్చిన పవిత్ర మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను ఈ కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. 12.40 గంటలకు మోడీ పునాది రాయి వేయనున్నారు. అనంతరం 12.45 గంటలకు ఆయన ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ముగియనున్నది.