భూరికార్డుల ప్రక్షాళనే ప్రధానం

by srinivas |
భూరికార్డుల ప్రక్షాళనే ప్రధానం
X

దిశ, ఏపీ బ్యూరో: భూ రికార్డుల ప్రక్షాళన దిశగా సమగ్ర సర్వే చేయాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షించారు. వివాదాలు తగ్గించేలా అందరికీ ఆమోద యోగ్యమైన సూచనలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్​కమిటీలో మంత్రులు కురుసాల కన్నబాబు, అనిల్​కుమార్​, సీసీఎల్​ఏ కార్యదర్శి నీరబ్​కుమార్​ ప్రసాద్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి ఉండనున్నారు. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కగా భు రికార్డులు పరిశీలన, సూచనలు చేయడమే కమిటీ లక్ష్యం కావాలని సూచించారు. 22A కింద ఉన్న భూములపై సరైన రీతిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఎస్టేట్, ఇనాం భూముల ఏం చేయాలనే దానిపై చర్చించారు. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల విషయంలో ఉన్న సమస్యలు, ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెలరోజులు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని భావించారు.

Advertisement

Next Story

Most Viewed