పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం

by srinivas |
పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం
X

దిశ, ఏపీ బ్యూరో: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితే ఆంధ్ర రాష్ట్రమని ఉప ముఖ్యమంత్రి అంజాద్​ బాషా అన్నారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప గోకుల్ సర్కిల్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడ్ని ఆదర్శంగా భావించి ముందుకు సాగాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి .. పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకొని కుల మత వర్గ భేదాలు లేకుండా అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు.

Advertisement

Next Story