రెజ్లింగ్‌లో భారత్‌కు మరో షాక్.. కాంస్యం ఆశలు గల్లంతు..

by Shyam |   ( Updated:2021-08-05 07:14:53.0  )
రెజ్లింగ్‌లో భారత్‌కు మరో షాక్.. కాంస్యం ఆశలు గల్లంతు..
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేటలో వెనకబడింది. వరుసగా ఇండియన్ అథ్లెట్లు ఒకరివెనుక మరొకరు ఇంటి బాట పడుతున్నారు. నిన్న రెజ్లింగ్‌ సెమీస్ మ్యాచులో ఓడిపోయిన దీపక్ పూనియా.. గురువారం జరిగిన 86 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో దీపక్ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. సెమీ‌స్‌లో ఓడిపోవడంతో కాంస్య పతకం అయినా గెలవాలని అతను పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. సాన్ మారినో రెజ్లర్ అమైనె చేతిలో దీపక్ పూనియా ఓడిపోవడంతో కాంస్య పతకం కూడా చేజారింది. తొలుత వీరిద్దరి మధ్య హోరాహరి మ్యాచ్ జరగగా చివరల్లో 3-2 తేడాతో దీపక్ పూనియా ఓటమి పాలయ్యాడు.

Next Story

Most Viewed