స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు

by Shyam |
స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: తనపై 139మంది 5వేల మార్లు రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి స్టేట్‌మెంట్‌ను భరోసా కేంద్రం అధికారులు రికార్డు చేసుకున్నారు. ఓ మహిళా ఎస్ఐ వద్ద సుమారు గంటకు పైగా తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు వాంగూల్మాన్ని ఇచ్చింది. ఈ సమయంలో భరోసా అధికారులు బాధితురాలు చెబుతున్న విషయాలను నోట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ)కి చెందిన ఓ సభ్యుడు ఆదివారం ఫోన్‌లో మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

అయితే బాధితురాలు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వివరాలను మహిళా సిబ్బందికి చెబుతుండగా.. ఒక అధికారి మధ్యలో జోక్యం చేసుకుంటూ వివరాలను తన ముందే చెప్పాలని వేధించినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఈ కేసులో తప్పంతా నీదే ఉంది. వెంటనే కేసు వాపసు తీసుకోవాలని సదరు పోలీస్ అధికారి బెదిరించాడని ఆ డీవీఎంసీ సభ్యుడితో తన గోడును చెప్పుకున్నట్లు సమాచారం.

సీబీ సీఐడీతో విచారించాలి- బత్తుల రాంప్రసాద్

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును సీబీ సీఐడీచే విచారించాలని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు, హైదరబాద్ జిల్లా డీవీఎంసీ సభ్యులు బత్తుల రాంప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తు అధికారిగా చట్ట ప్రకారం ఏసీపీ స్థాయి అధికారి ఉండాలన్నారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని ప్రభుత్వం సీబీ సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed