ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

by Shyam |   ( Updated:2020-10-11 09:02:29.0  )
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, ఖాళీగా ఉన్న 20వేల పోస్టులను భర్తీ చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఎస్‌జీటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సంకినేని మధుసూదనరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా 2018లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఇచ్చిన హామీలనే అమలు చేయడం లేదని వాపోయారు. ప్రధాన కార్యదర్శి కె.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల వరకు ఉపాధ్యాయులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు.

పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి: యూఎస్‌పీసీ

ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని ఉపాధ్యాయ సంఘాల (యూఎస్‌పీసీ) స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం వర్చవల్ విధానంలో రూపొందించారు. పదోన్నతులు, బదిలీలు అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకుంటే యూఎస్‌పీసీ, జాక్టో ఉమ్మడిగా ఇతర సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed