వెంటాడుతోన్న DELTA వేరియంట్.. అత్యధికంగా అక్కడే!

by vinod kumar |
Delta and delta plus variants
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రమంగా వైరస్ మ్యుటేట్ అవుతూ ఉండటంతో మమమ్మారికి అడ్డుకట్ట వేయడం కష్టతరంగా మారింది. ఇండియాలో ఇటీవలే సెకండ్ వేవ్ ముగియగా.. థర్డ్ వేవ్ ఎప్పుడు విరుచుకుపడుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా యూరప్ దేశాలను డెల్టా వేరియంట్ ప్రస్తుతం వెంటాడుతోంది. తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.

డెల్టా వేరియంట్ యూరప్‌లో బలంగా ప్రబలుతోందని వెల్లడించింది. జూన్ 28 నుంచి జూలై 11 మధ్యలో విడుదలైన డేటా ప్రకారం భారతదేశంలో మొదట గుర్తించిన డెల్టా వేరియంట్ వైరస్.. 28 యూరోపియన్ దేశాల్లో కనీసం 19 దేశాల్లో ఈ వైరస్ ఆధిపత్యం చెలాయిస్తుందని WHO స్పష్టం చేసింది. ఈ 19 దేశాలలో సగటున 68.3శాతం నమూనాల్లో ఇది కనుగొనబడిందని నివేదికలో పేర్కొంది.

Advertisement

Next Story