వారంపాటు ఢిల్లీ సరిహద్దులు బంద్: కేజ్రీవాల్

by Shamantha N |
వారంపాటు ఢిల్లీ సరిహద్దులు బంద్: కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను వారం రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం అత్యవసర సేవలు, ప్రభుత్వ అనుమతిచ్చే ఈ-పాస్‌లు ఉన్నవారినే సరిహద్దులోనికి లేదా బయటకు అనుమతిస్తామని తెలిపారు. వారం తర్వాత మళ్లీ ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని చెప్పారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజలు చికిత్స కోసం ఢిల్లీకి వస్తున్నారని, ఢిల్లీవాసులకు ఇక్కడి ఆస్పత్రులను రిజర్వ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ‘నీకు లేదా నీ కుటుంబ సభ్యులకు వైరస్ సోకితే వారికి ఢిల్లీ ఆస్పత్రిలో ఒక బెడ్ సిద్ధంగా ఉంటుందని సీఎంగా నేను హామీనిస్తున్నా’ అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, లాక్‌డౌన్ 5.0లో ఢిల్లీలో సెలూన్ షాపులు(స్పా మినహా), మార్కెట్లు, ఇతర దుకాణాలు అన్నీ ప్రతి రోజు తెరుచుకోనున్నాయి. వాహనాల్లో ప్రయాణించేవారి సంఖ్యపైనా ఆంక్షలను సర్కారు ఎత్తేసింది.

Advertisement

Next Story

Most Viewed