ఢిల్లీ, కశ్మీర్, బీహార్‌లకు టెర్రర్ అలర్ట్!

by Shamantha N |
ఢిల్లీ, కశ్మీర్, బీహార్‌లకు టెర్రర్ అలర్ట్!
X

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీ, జమ్ము కశ్మీర్, బీహార్‌లకు ఉగ్రముప్పు ఉన్నట్టు సమాచారమిచ్చాయి. ఈ నెల 22న ఈ అలర్ట్ సిగ్నళ్లను పంపాయి. సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, నేపాల్ సరిహద్దు నుంచి గతనెలలో ఆకస్మికంగా కాల్పులు జరిగాయి. ఈ తరుణంలోనే పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ భారత్‌లో మారణహోమం సృష్టించే ప్రణాళికలు వేస్తున్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తాలిబన్, జైషే ఉగ్రవాదులతో ఈ దాడులు జరిపించే ధ్వంస రచన చేస్తున్నదని తెలిపాయి. దాదాపు 20 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోని ఎల్‌వోసీ గుండా భారత్‌లోకి చొరబడవచ్చునని, అలాగే, పటిష్ట సరిహద్దు పహారాలేని నేపాల్ నుంచీ బీహార్‌లోకి మరో ఉగ్రమూక అడుగుపెట్టవచ్చునని అప్రమత్తం చేశాయి. వారి టార్గెట్ దేశరాజధాని కావొచ్చని, లేదా రాజకీయ ప్రముఖులైనా కావొచ్చని వివరించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకే సరిహద్దులో భారత్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది.

Advertisement

Next Story

Most Viewed