సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

by Shyam |
సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

దిశ, స్పోర్ట్స్: యువ రెజ్లర్ సాగర్ దండక్‌పై ఈ నెల 4న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాడి చేయడంతో అతడు చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో సుశీల్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరిగింది.

తనపై పెట్టిన కేసు అంతా నిరాధారమని.. తాను సాగర్‌ను కొట్టానని చెప్పడం అబద్దమని.. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ కుమార్ పిటిషన్‌లో కోరాడు. కాగా రోహిణి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీష్ కుమార్ ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను నిరాకరించారు. అతడు దాడికి పాల్పడినట్లు వీడియో ఆధారం ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోరారు.

Advertisement

Next Story

Most Viewed