- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుల్‌జోష్‌లో రక్షణరంగ సూచీలు..
ముంబయి: దేశీయ రక్షణ రంగ పరిశ్రమల సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 5 నుంచి 13 శాతానికి పైగా లబ్ధి పొందాయి. దాదాపు 101 రక్షణరంగ ఉత్పత్తుల దిగుమతుల(Imports)పై నిషేధం(Ban) విధిస్తున్నామని, వాటిని దేశీయ సంస్థల(Domestic companyees) నుంచి కొనుగోలు చేస్తామని ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించడం రక్షణ రంగ పరిశ్రమలకు కొత్త జోష్‌ను ఇచ్చాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్ (Bharath electronics) 13 శాతం(షేరు ధర 112), భారత్ డైనమిక్స్ (Bharath dynamics) 6.9శాతం( షేరు ధర448), బీఎంఈఎల్ (Bmel) 4.5శాతం(రూ.686), భారత్ ఫోర్జ్ ((Bharath forz)5.8శాతం(షేరు ధర రూ.432) మేరకు లాభ పడ్డాయి. రక్షణ రంగ నిషేధిత జాబితాలో ఆర్టిలరీ గన్స్, అటాక్ రైఫిల్స్ కొర్వెట్స్, సోనార్ సిస్టమ్స్, టాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, లైట్ కంబాట్ హెలికాప్టర్లు, రాడర్లు తదితర రక్షణ రంగ ఉత్పత్తులు ఉన్నాయి. వచ్చే ఆరు నుంచి ఏడేండ్లలో దేశీయ రక్షణ పరిశ్రమల నుంచి రూ.4లక్షల కోట్ల ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్లు రక్షణ మంత్రి ప్రకటించిన విషయం విదితమే.