చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ??

by Shamantha N |
చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ??
X

దిశ, వెబ్ డెస్క్: మాస్కోలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన కోసం రష్యాకు వెళ్లారు. కాగా కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రుల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

చైనా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి చర్చలకు అభ్యర్ధన రావడంతో రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు చైనా రక్షణ మంత్రి వీ ఫెంగీతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. చైనా, భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తుండటంతో గత నాలుగు నెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ఇరువర్గాలు దౌత్యపరమైన చర్చలు జరుపుతుండగా నాలుగు రోజుల క్రితం సదరన్ బ్యాంక్ ఆఫ్ పాంగాంగ్ సరస్సులో భారత భూభాగాన్ని ఆక్రమించటానికి చైనా యత్నించింది. దీంతో మరోసారి అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed