- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికాకు అంత డిమాండా?
బాహుబలి సినిమాతో తన పేరును విశ్వవ్యాప్తం చేసుకున్న కథానాయకుడు.. ప్రభాస్. తనతో ఒక్క సెల్ఫీ దిగితే చాలని అభిమానులు అనుకుంటే.. తనతో ఒక్క సీన్‌లో నటిస్తే చాలనుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పారు కూడా. బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. బాహుబలి చూసి ప్రభాస్ ఫ్యాన్ అయిపోయానని.. తనతో కలిసి నటించే చాన్స్ వస్తే వదులుకోనని గతంలో అలియా భట్ చెప్పిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీ భాగ్యశ్రీ కూడా బాహుబలికి తల్లిగా నటించడం పట్ల చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానని చెప్పింది.
అయితే, బ్యూటిఫుల్ దీపికా పదుకొనె మాత్రం ప్రభాస్‌తో నటించేందుకు 20 శాతం అధిక రెమ్యునరేషన్ అడిగిందని సమాచారం. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీకి హీరోయిన్‌గా దీపికను సంప్రదించారట దర్శక, నిర్మాతలు. కానీ తను ఈ సినిమాలో నటించేందుకు భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియా నుంచి వస్తున్న మూవీ కావడంతో రెమ్యునరేషన్ విషయంలో కాస్త బెట్టు చేసిందని టాక్. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ దీపికను విమర్శిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ అంటే అంత చులకనా? అంటూ తిట్టిపోస్తున్నారు.