కరోనా వల్ల మెట్రో నగరాల్లో తగ్గిన గాలి కాలుష్యం

by vinod kumar |
కరోనా వల్ల మెట్రో నగరాల్లో తగ్గిన గాలి కాలుష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని మెట్రో నగరాల్లో వాయుకాలుష్యం తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు దాదాపు 90 నగరాల్లో గత రెండు వారాలుగా గాలికాలుష్యం తక్కువగా నమోదవుతోంది.

కేంద్ర ప్రభుత్వం అధీనంలో పని చేస్తున్న సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫార్) వారి లెక్కల ప్రకారం కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రభావంతో పీఎం2.5 (ఫైన్ పర్టిక్యులేట్ పొల్యూటెంట్) శాతం ఢిల్లీలో 30 శాతానికి, అహ్మదాబాద్, పూనెల్లో 15 శాతానికి పడిపోయింది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు శ్వాసలో ఇబ్బంది కలిగించే నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి కూడా తగ్గినట్లు సఫార్ తెలిపింది. మోటార్ వెహికిల్స్ బయటికి రాని కారణంగా ముంబైలో 38 శాతం, పూనెలో 43 శాతం, అహ్మదాబాద్‌లో 50 శాతం నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల తగ్గిపోయిందని వెల్లడించింది.

సాధారణంగా మార్చి నెలలో వాయు కాలుష్యం మోడరేట్ స్థాయిలో అంటే 100 నుంచి 200 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఉంటుందని కానీ ఇప్పుడు దాని విలువ 50 నుంచి 100 మధ్య, కొన్ని సార్లు 0 నుంచి 50 మధ్య ఉండి సాటిస్‌ఫ్యాక్టరీ లేదా గుడ్ స్థాయిలో ఉంటోందని సఫార్ సైంటిస్టు గుఫ్రాన్ బెయిగ్ వివరించారు. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు తిరగకపోవడం, ఫ్యాక్టరీలు మూత పడటం వల్ల ఇది సాధ్యమైందని, కరోనా కారణంగా కలిగిన ఒకే ఒక శుభసూచకం ఇదేనని ఆయన అన్నారు. అయితే ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రకృతికి విఘాతం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు సలహా ఇస్తున్నారు.

Tags : Corona, COVID 19, Air pollution, Metro cities, Delhi, Pune, Mumbai, Particulate matter, PM 2.5, SAFAR

Advertisement

Next Story

Most Viewed