రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీఈఈ

by Kalyani |
రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన డీఈఈ
X

దిశ, నాగారం: రమేష్ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ.. అవినీతి నిరోధక శాఖ వలకు మున్సిపల్ డీఈఈ సుదర్శనం చిక్కారు. సీసీ రోడ్డు పనులకు రూ.11 లక్షల బిల్లు క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ వద్ద 16 శాతం చొప్పున రూ. 1.30 లక్షలు డిమాండ్ చేశారు. అయితే బిల్లు చెల్లించడానికి డీఈఈ సుదర్శనం కాంట్రాక్టర్ వద్ద రూ. 1.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ. లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఈఈ సుదర్శనం తో పాటు మున్సిపల్ కార్యాలయం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (వర్క్ ఇన్స్పెక్టర్లు)గా పని చేస్తున్న వి. రాకేష్, వి. సురేష్ లు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.



Next Story

Most Viewed