- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నీళ్లలో.. మెదడును తినే అమీబా!
దిశ, వెబ్‌డెస్క్ : రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగితే.. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు తరుచుగా చెబుతుంటారు. కానీ అవే నీళ్లు కాస్త కలుషితమైనా.. ఎన్నో రోగాలు మన శరీరంపై దాడిచేస్తాయి. అందుకే నీళ్లను వేడి చేసుకొని తాగాలని సలహా ఇస్తుంటారు. అయితే, ఒక్కోసారి ప్రాణాంతకమైన సూక్ష్మజీవులు కూడా నీళ్లలో పెరుగుతుంటాయి. తాజాగా యూఎస్‌లోని టెక్సాస్‌లో ట్యాప్ వాటర్‌లోనే మెదడును తినేసే సూక్ష్మజీవులున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇటీవలే.. జోష్ మెక్లెంటైర్ అనే ఆరేళ్ల పిల్లోడు నీటిలో ఆడుకున్న తర్వాత తీవ్ర ఆనారోగ్యానికి గురై సెప్టెంబర్ 8న మరణించాడు. దాంతో ఆరోగ్య శాఖ అధికారులు అసలు ఆ పిల్లోడి మరణానికి కారణమేంటో తెలుసుకోవడానికి నీటి శాంపిల్స్‌ను పరీక్షించి చూశారు. ఆ నీళ్లలో.. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. టెక్సాస్‌లోని లేక్ జాక్సన్ నగర వాసులు ట్యాప్ వాటర్‌ను నేరుగా ఉపయోగించొద్దని ప్రకటించారు. తాగడానికి, వంట చేసుకోవడానికి కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలని పేర్కొన్నారు. ఫేస్ వాష్, స్నానం లేదా స్విమ్మింగ్ చేసుకునేటప్పుడు.. ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అధిక ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు.
ఆ బాలుడి మృతికి.. ‘నెగ్లేరియా ఫౌలేరి’ అనే అమీబానే కారణమని వైద్యులు ధృవీకరించారు. ఈ అమీబా ఏక కణ జీవి. ఫ్రెష్ వాటర్, భూమిలో ఈ అమీబాలు పెరుగుతుంటాయి. నీళ్లలో ఉండే ఈ అమీబాలు.. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, బ్రెయిన్ దగ్గరకు చేరుకుంటాయని సీడీసీపీ (Centers for Disease Control and Prevention) తెలిపింది. దీనివల్ల ‘ప్రైమరీ అమెబిక్ మెనిన్గోఎన్సేఫిలిటీస్’ అనే అరుదైన వ్యాధి వస్తుందని తెలిపారు.