డీడీలో.. మళ్లీ రామాయణం, మహాభారతం

by Shyam |
డీడీలో.. మళ్లీ రామాయణం, మహాభారతం
X

ఛానళ్ల హవా కొనసాగకముందు… వార్తలు తెలుసుకోవాలన్నా…. కొత్త పాటలు వినాలన్నా… సినిమాలు చూడాలన్నా… విజ్ఞాన, వినోద కార్యక్రమాలు కోసం ఎదురు చూడాలన్నా.. అన్నింటికీ దూరదర్శన్ చానలే. డీడీ చానెల్ కు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు కూడా మరే చానల్ కు లేదంటే అతిశయోక్తి కాదేమో. వార్త చానెల్లు ఏవీ తిప్పినా కరోనా వార్తలే. సోషల్ మీడియా నిండా కరోనా కథనాలే. టీవీ సీరియల్స్ కూడా ప్రసారం కావడం లేదు. పాత వాటినే తిప్పి తిప్పి చూపిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలకు మళ్లీ దూరదర్మన్ గుర్తుకు వచ్చింది. 1987 లో దూరదర్శన్ లోప్రసారమై ప్రజలను భక్తిభావంతో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణం ధారావాహిక.. అప్పట్లోనే ఓ సెన్సేషన్. దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలపింది.

రామాయణం, మహాభారతం ఎన్ని సార్లు చూసిన, విన్నా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. వినాలనిపిస్తాయి. పిల్లలే కాదు నేటి యువత కూడా మన పురాణాలను, ఇతిహాసాలను నేర్చుకోవాలి. అందుకు క్వారెంటైన్ టైమ్ ను ఉపయోగించుకోవచ్చు. మన భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఈ తరానికి అందించే అద్భుత అవకాశమిది. పెద్దలందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు రామాయణ, మహాభారత సీరియల్లు కూడా ఉపయోగపడతాయి . దూరదర్శన్‌లో 33 ఏళ్ల కిందట ప్రసారమైన రామాయణ, మహాభారత సీరియళ్లు ఓ చరిత్రను సృష్టించాయి.. అయితే ఈ సీరియళ్లు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యన ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాయి.. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితం అయిన నెటిజన్లు రామాయణ్‌, మహాభారత్‌ సీరియల్స్‌ను పునఃప్రసారం చేయాలంటూ ట్విటర్‌ లో రిక్వెస్ట్ చేశారు. వారి కోరిక మేరకు రామాయణ్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నట్టు సమాచార ప్రసార శాఖామంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశారు. మార్చి 28 (శనివారం) నుంచి డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌)లో రోజూ రెండు రామాయణ్‌ ఎపిసోడ్‌లు..ఉదయం 9-10 గంటలు, సాయంత్రం 9-10 గంటలకు ప్రసారం కానున్నాయి. దూరదర్సన్ ఛానల్ లో … మార్చి 28, శనివారం ఉదయం ఒక ఎపిసోడ్ ను ప్రసారం చేసింది. దీని 2వ భాగం శనివారం రాత్రి ప్రసారం అవుతుంది.. డీడీ భారతి లో మహాభారత్ ప్రసారం కానుంది.

రామాయన్ పై కాజల్ ట్వీట్:

టాలివుడ్ నటి కాజల్ అగర్వాల్ కూడా ‘‘దూరదర్శన్ చానల్ లో ప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం చూస్తున్నానని …. అవి తనను బాల్యంలోకి తీసుకెళ్లాయని ట్వీట్ చేసింది. కుటుంబమంతా క‌లిసి చూస్తున్నాం. ఇది మా ఫ్యామిలీ వీకెండ్ ప్లాన్. రామాయణం మ‌ళ్లీ ప్రారంభం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్ల‌లు భారతీయ పురాణాలను నేర్చుకోవడానికి ఇది గొప్ప మార్గం’’ అంటూ ఆమె ట్వీటారు. కాజ‌ల్‌తో పాటు కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ కూడా తాను రామాయ‌ణం వీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు.

Tags: ramayana, mahabharata, lock down, coronavirus, doordarshan, kajal agarwal, twitter

Advertisement

Next Story