దానికోసమే భారత మహిళను పెళ్లాడనంటున్న ఉగ్రవాది..

by Shamantha N |
దానికోసమే భారత మహిళను పెళ్లాడనంటున్న ఉగ్రవాది..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో విధ్వంసాలు సృష్టించేందుకు టెర్రరిస్టులు కొత్త పథకాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి మనుషుల్లో కలిసిపోయి సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తూ అందరి దృష్టిని మరల్చుతున్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేస్తున్నారంటే, వారు ఈ దేశానికి ఎందుకు వచ్చారో ఆ పని పూర్తయ్యేవరకు రూపాలు మార్చుకుని తిరుగుతున్నారని ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

దేశరాజధాని ఢిల్లీలో గతంలో అరెస్టైన పాకిస్తానీ జాతీయత ఉగ్రవాది అహ్మద్ నూరి గురించి DCP (స్పెషల్ సెల్) ప్రమోద్ కుశ్వాహా మంగళవారం వివరాలు వెల్లడించారు. సాధారణ ఇండియన్ పౌరుడికి వచ్చే ధృవపత్రాల కోసం ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడని విచారణలో టెర్రరిస్టు తెలిపాడన్నారు. అంతేకాకుండా అతని వద్ద భారతీయ పాస్‌పోర్ట్ కూడా ఉందని గుర్తించారు. ఇటీవల ఆ పాస్‌పోర్టు మీద థాయ్‌లాండ్ మరియు సౌదీ అరేబియాకు ట్రావెల్ చేసినట్టు తెలిపారు.

దేశంలో అలజడులు రేపేందుకు ఆ టెర్రరిస్టుకు పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని కుష్వాహా తెలిపారు. ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలను భారత్‌లో అమలు చేసేందుకే అతను ట్రైన్ చేయబడ్డాడని డీసీపీ ప్రమోద్ కుశ్వాహా చెప్పారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ఇంకా అతని వలే ఎంతమంది ఉన్నారో కనుక్కునేందుకు విచారణ జరుపుతున్నామన్నారు.

Advertisement

Next Story