‘దయ్యంతో సహ జీవనం’ అద్భుతం

by Shyam |
‘దయ్యంతో సహ జీవనం’ అద్భుతం
X

దిశ, వెబ్‌డెస్క్ : నట్టీస్ ఎంటర్ టైన్‌మెంట్స్, క్వీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నట్టి కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం దయ్యంతో సహ జీవనం ( డి.ఎస్.జె). నట్టి లక్ష్మి సమర్పిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ.. నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా దర్శకత్వంలో నా కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటించడం నాకు సంతోషంగా ఉంది. నేను నా కూతురికి పాటలు నేర్పినట్లు అనిపిస్తోంది. అలాగే నా కుమారుడు నట్టి క్రాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేము అడిగినవన్నీ మాకు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో నా కొడుకు, కూతురు నిర్మాతగా హీరోయిన్ గా వ్యవహరించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి హీరోగా అద్భుతంగా నటించాడు. కరోనా సమయంలో కూడా మేము అడగ్గానే మా సినిమా చేసినందుకు రోషన్ సాలూరికి ధన్యవాదాలు.

హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ… మా సినిమా డి.ఎస్.జె టీజర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. కరోన సమయంలో అందరూ సహకరించడం వల్ల షూటింగ్ ఈజీగా పూర్తి అయ్యింది. హీరో రోషన్ సాలూరి మాట్లాడుతూ… నట్టికుమార్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది. నట్టి కరుణ బాగా నటించింది, నటిగా తనకు మంచి భవిషత్తు ఉంటుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. నట్టి క్రాంతి సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా సుపూర్ణ మాలకర్ నటిస్తుండగా.. హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు ఇతర తారగణం. కెమెరామెన్ గా కోటేశ్వర రావు, సంగీతం ఎస్.ఏ.కుద్దుస్, ఎడిటింగ్ గౌతంరాజు, ఆర్ట్ కెవి.రమణ, ఫైట్స్ కె.అంజిబాబు, పీఆర్వో మధు.విఆర్.

Advertisement

Next Story