- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదర్శం.. తల్లి పాఠాలు చెప్పే ప్రభుత్వ స్కూల్లోనే కూతురు
దిశ, చేవెళ్ల: ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తన కూతురును ఏ ప్రైవేటు పాఠశాలనో.. లేక కార్పొరేట్ స్కూల్లోనో చేర్పిస్తారు. కానీ తన కూతురును మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి అందరి చేత భేష్ అనిపించుకున్నారు. ఇది ఎక్కడో కాదు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ముద్దెం గూడ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. షాబాద్ మండలం ముద్దెంగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు పి. మల్లేశ్వరి. తల్లి గవర్నమెంట్ కొలువు, తండ్రి ప్రైవేట్ లెక్చరర్‌గా రాణిస్తున్నా.. కూతురిని మాత్రం ప్రభుత్వ స్కూల్‌లో (ఒకటవ తరగతి)లో చేర్పించడం విశేషం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సహచర ఉపాధ్యాయులు, బంధువులు స్నేహితులు వారిని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం ఉచిత పాఠ్యపుస్తకాలు తదితర వాటిని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తోటి ఉద్యోగిని మల్లేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.