స్నానానికి వెళ్లి వస్తా అన్న కూతురు.. బాత్ రూమ్‌లో చేసిన పనికి షాక్ అయిన తల్లిదండ్రులు

by Sumithra |
suicide
X

దిశ, జల్​పల్లి: కూతురు తరచు ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆమెను మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. బాలాపూర్​ ఇన్‌స్పెక్టర్​భాస్కర్​తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్​ మండలం మల్లాపూర్​ గ్రామానికి చెందిన పోలోజు ఆంజనేయచారికి నలుగురు సంతానం. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న రెండవ కూతురు దివ్యశ్రీ (21) తరచు ఫోన్​ మాట్లాడుతుందని తండ్రి గమనించి మందలించాడు. ఆమె ఫోన్‌ను​ లాక్కున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం 1గంటలకు స్నానం చేసి వస్తానని బాత్​రూమ్‌కి వెళ్ళింది. అరగంట అయినా తిరిగి రాకపోవడంతో తల్లి వెంటిలేటర్​నుంచి చూడగా ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్​పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బాలాపూర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story