- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ వద్దన్నందుకు ఉరేసుకున్న బాలిక..
దిశ, వెబ్ డెస్క్: ఫోన్ లో ఆటలు ఆడొద్దని తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై ఇంటర్ విద్యార్ధి ఆత్మ హత్య చేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ సరిధిలో ఈ ఘటన జరిగింది. వెల్దు్ర్థి మనోహరాచారి, లావణ్య దంపతులు పదేళ్లుగా సర్వోదయ నగర్ లో అద్దె ఇంట్లో నివసిస్తు్న్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉండేది. అది గమనించిన తండ్రి రాత్రి పూట ఆటలెందుకు ? త్వరగా పడుకోవాలని గట్టిగా మందలించాడు.
దాంతో మనస్తాపానికి గురైన కూతురు ఆవేశంతో బెడ్ రూం లోకి వెళ్లి గడియ వేసుకుంది. సరే పడుకుంటుంది అనుకున్నారు తల్లి దండ్రులు, కానీ లోపలికి వెళ్లిన తను చున్నీ తో ఫ్యానుకు ఉరేసుకుంది. గదిలో ఏదో శబ్దం వస్తున్నట్టు గమనించిన తల్లి కిటికీ లోంచి చూసింది. అప్పటికే ఫ్యానుకు వేలాడుతున్న కూతురును చూసి లబోదిబో మంది. అదే గదిలో చిన్న కూతురు కూడా పడుకుంది. తల్లి అరుపులకు లేచి గడియ తీసింది. స్థానికుల సహాయంతో కౌశికిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.