- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
టీఆర్ఎస్ అక్రమ కేసులకు భయపడం: దాసోజు

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుపయోగంగా ఉన్న ఆసుపత్రిని పేదల కొవిడ్ చికిత్స కొరకు ఉపయోగించాలని టీఆర్ఎస్ ప్రభుత్వంను కోరిన పాపానికి కాంగ్రెస్ నేతలపై కేసులు పెడతారా ? ప్రశ్నించే గొంతుకని అణిచేయాలని చూస్తారా ? ఇదెక్కడి దుర్మార్గం ? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖైరతాబాద్ చౌరస్తా బడా గణేష్ మండపానికి ముందు హాస్పిటల్ ఉందని, 2013-14లో దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ ఈ హాస్పిటల్‌ని నిర్మించిందని గుర్తు చేశారు. హాస్పిటల్‌కి కావాల్సిన అన్ని రకాల వసతులు కూర్చిందని, 50 పడకలతో ఏసీ బెడ్స్, స్కానింగ్ మిషన్స్, ఇలా కార్పోరేట్ స్థాయిలో వనరులు సమకూర్చి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్పిటల్‌ని అప్పగించిందని తెలిపారు. కానీ గత ఏడేళ్ళుగా ఆ హాస్పిటల్ ని నడిపించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైయిందని ఆరోపించారు.