మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌‌కు ఊరట..

by Sumithra |
మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌‌కు ఊరట..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు ఊరట లభించింది. రాజ్యసభ సభ్యులు ధర్మపూరి శ్రీనివాస్ తనయుడు సంజయ్‌పై 2018 ఆగస్టులో నమోదైన లైంగిక వేధింపుల కేసును మంగళవారం జిల్లా కోర్టులో నేరారోపణలు ప్రాసిక్యూషన్ వారు రుజువు చేయకపోవడంతో కేసును కోట్టివేసింది. ధర్మపూరి సంజయ్ చైర్మన్‌గా ఉన్న శాంకరి నర్సింగ్ కళాశాలలో చదువుతున్న 12 మంది విద్యార్థినులు తమను సంజయ్ వేధించాడని ఫిర్యాదు చేశారు. నగర మూడవ టౌన్ పోలిసులు కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఈ కేసును నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ విచారణ జరిపి కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. నేర విచారణలో భాగంగా 12 మంది విద్యార్థినులు సాక్ష్యాలను నమోదు చేసి, ఇతర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం మాజీ మేయర్ ధర్మపూరి సంజయ్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టి వేస్తూ నిజామాబాద్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల విచారణ న్యాయస్థానం జడ్జి గోవర్ధన్ రెడ్డి తీర్పు చెప్పారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed