- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కుమారులు ఉగ్రవాదులు కాదు.. మాలిక్ సోదరుల తండ్రి
దిశ, వెబ్‌డెస్క్: దర్భాంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో నివాసం ఉంటున్న మాలిక్ బ్రదర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్, నాసిర్ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్లు ఇద్దరు కాదు.. ముగ్గురు అని తేలింది. దీంతో వీళ్లకు మహా నెట్‌వర్కే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై బీహార్‌లో, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. వీరు మరో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేవలం బ్లాస్ట్‌లు కాకుండా ప్రమాదాలు సృష్టించే పని పెట్టుకుని జనం చావును కోరుకుంటున్నట్లు NIA అనుమానం వ్యక్తం చేస్తోంది.
తాజాగా.. దర్భంగా కేసులో అరెస్ట్ అయిన మాలిక్ సోదరుల తండ్రి ముసాఖాన్ దీనిపై స్పందిస్తూ.. మా కుమారులు ఉగ్రవాదులు కాదని, వారు ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. కాగా, గతంలో ఆర్మీలో పనిచేసిన ముసాఖాన్ 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని కాయస్తవాడలో పెళ్లి సామాగ్రి వ్యాపారం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారానికి కొడుకులు మాలిక్, ఇమ్రాన్‌లు అండగా నిలిచేవారని వెల్లడించారు. కాగా దర్భంగా కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.