బిగ్‌బ్రేకింగ్.. దళిత బంధుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-09-01 01:10:33.0  )
Dalit Bandhu scheme, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే దళిత బంధు అమలు చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని.. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని సీఎం కేసీఆర్ దళిత బంధు అమలుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేస్తుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.

Advertisement

Next Story