- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశీయ డైరీ వృద్ధి సాధిస్తుంది: ఇక్రా!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ డైరీ పరిశ్రమ 9-11 శాతం వృద్ధి చెందుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాల్లో పునరుజ్జీవనంతో పాటు పాలు, పాల ఉత్పత్తుల వినియోగం పెరగడం, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ప్రజల్లో ఆహార ప్రాధాన్యతలు మారిపోయాయని ఇక్రా అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో డిమాండ్ 9-11 శాతం పెరుగుతుందని, దీర్ఘకాలికంగా డైరీ పరిశ్రమ స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్టు ఇక్రా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సాధారణ ఋతుపవనాల కారణంగా పాల ఉత్పత్తి 5-6 శాతం పెరుగుతుంది.
కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావం తర్వాత పరిశ్రమలో వినియోగం స్థిరమైన పునరుద్ధరణను సాధిస్తోంది. అసంఘటితంగా ఉన్న విభాగంతో పోలిస్తే పరిశ్రమలో ఆర్గనైజ్‌డ్ డెయిరీ విభాగాలు 26-30 శాతం వాటాతో వేగవంతమైన వృద్ధిని సాధించాయని, రానున్న రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగనున్నట్టు ఇక్రా వైస్-ప్రెసిడెంట్ శీతల్ శరద్ చెప్పారు. ఇదే సమయంలో పెరుగు, ఐస్‌క్రీమ్ లాంటి విభాగాలు డిమాండ్ రికవరీ సాధించడంలో నెమ్మదిగా ఉన్నాయని శీతల్ వివరించారు.