బెంగాలీ వలస కార్మికులకు సాయం

by Aamani |
బెంగాలీ వలస కార్మికులకు సాయం
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న 50 మంది బెంగాలీ వలస కార్మికుల కుటుంబాలకు ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ అడ్వైజర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ,ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో తోటి వారిని ఆదుకోవాలని కోరారు. సిటీలో పలు చోట్ల సీపీఎం నాయకులు, సానుభూతిపరులు దాతల నుంచి వచ్చిన నిధులను సక్రమంగా అవసరమైన వారికి అందేలా కృషి చేస్తున్నామనితెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా నివారణకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కిరణ్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags: daily needs, distribution, bengal migrant workers, covid 19 effect



Next Story

Most Viewed